Flamingo flowers: మిజోరాంలో ప్రతిఏటా ఆంథూరియం ఫెస్టివల్..! 6 d ago

అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్ స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ మిజోరం నుండి సింగపూర్ కు తొలిసారిగా ఆంథూరియం పువ్వులను ఎగుమతి చేసింది. ఆంథూరియం పువ్వులు ఇవి వివిధ రంగులలో పూస్తాయి. వీటిని ఫ్లెమింగో పువ్వులు అని కూడా పిలుస్తారు. ఇవి ఉష్ణమండల అమెరికా ప్రాంతానికి చెందినవి. భారతదేశంలో మిజోరాం మరియు ఇతర రాష్ట్రాలలో విస్తారంగా దీనిని సాగు చేస్తున్నారు . ఫ్లెమింగో పువ్వులను తమిళనాడు (21%), కర్ణాటక (16%), మధ్యప్రదేశ్ (14%) మరియు పశ్చిమ బెంగాల్ (12%) ఇలా అనేక రాష్ట్రాలలో వాణిజ్యపరంగా సాగు చేయబడుతుంది. అమెరికా, నెదర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే మరియు కెనడా.వంటి దేశాలు భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి
చుట్టుపక్కల గాలిని శుద్ధి చేయడంతో పాటు ఫార్మాల్డిహైడ్, అమ్మోనియా, టోలుయెన్, జిలీన్ మరియు అలర్జీ వంటి కారకాల హానికరమైన ఎయిర్ బోర్న్ కెమికల్స్ ను తొలగిస్తుంది కాబట్టి నాసా దీనిని ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ల జాబితాలో ఉంచింది. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మరియు ఈ పువ్వుల యొక్క విలువను తెలియజేసేందుకు మిజోరాం ప్రభుత్వం ప్రతిఏటా "ఆంథూరియం ఫెస్టివల్" ను జరుపుకుంటున్నారు. ఇదొక వార్షిక సాంస్కృతిక మరియు పర్యాటక కార్యక్రమం.